Find Articles

వచ్చేసిన ‘ పెద్ది ’ ట్రైలర్ .. థియేటర్లలో మెగా జాతర ఖాయం!

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో మెగా జాతర ఖాయంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రామ్‌చరణ్ మేకోవర్, ఆయన నటన, డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న స్పోర్ట్స్ డ్రామాను దర్శకుడు బుచ్చిబాబు ఎంత ఎమోషనల్‌గా తెరకెక్కించారో ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. చెర్రీ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదగడాన్ని మనం గమనించొచ్చు. ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రత్నవేలు విజువల్స్ ట్రైలర్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. అలాగే ‘‘మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికి ఉందో రమ్మను’’ అనే డైలాగ్‌ మాస్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

మొత్తంగా ‘పెద్ది’ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్ ఉన్న పక్కా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మెటీరియల్‌లా కనిపిస్తోంది. మరీ ఇన్ని అంచనాలతో జూన్ 4న థియేటర్లలో పెద్ది బాక్సాఫీస్ వేట ఎలా ఉండబోతుందో చూడాలి!

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *