అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్ లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు.
పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు చోటు చేసుకున్నాయని సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు మస్కటీన్ కు చెందిన ర్యాన్ విల్లీస్ గా గుర్తించారు. అయితే పోలీసుల రాకను గమనించిన విల్లీస్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా.. మరో ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. మరోవైపు మస్కటీన్ లోని ఓ నివాసంలో, గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. నిందితుడితో సహా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని ప్రాథమికంగా అంచనా వేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
American Actress Jo Sharma got BEST DEBUT HEROINE AWARD for M4M Movie & Mohan Vadlapatla…
పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…