ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ 2026లో ఆయన పాల్గొన్నారు. “సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో చూపిస్తున్న వేగమే (Speed) ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆంధ్రప్రదేశ్ ఉత్పాదక (Manufacturing) రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడుతోంది. రాయలసీమ ప్రాంతానికి ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ రాకతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి ‘బుల్లెట్’ వేగంతో దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు.ఈ సదస్సు వేదికగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధుల బృందం మంత్రి నారా లోకేష్‌ను ప్రత్యేకంగా కలుసుకుంది. ఏపీలో తమ వ్యాపార విస్తరణ, ప్రగతికి సూచికగా మంత్రి లోకేష్‌కు ఒక ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ జ్ఞాపికను (Memento)’ బహుకరించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…