Categories: Telangana

అమెరికాలో ప్రాణాలతో పోరాటం చేస్తున్న కూతురు.. అల్లాడుతున్న కన్నపేగు

ఉన్నత చదువులు చదవడానికి విదేశాలకు వెళ్లిన కూతురు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంది. కానీ ఆమెను చూసే అవకాశం లేదు. దాంతో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ నాగార్జున కాలనీలో నివసించే లగిశెట్టి శ్రీనివాస్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్పందన. చెన్నైలో బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లింది. చికాగో నగరానికి సమీపంలో ఉన్న ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఎల్మ్ ర్ హర్ట్స్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే కాలేజీకి వెళ్లిన స్పందన మెట్రో ట్రైన్ లో తన నివాసానికి చేరుకునే క్రమంలో ప్రమాదానికి గురైంది. మెట్రోస్టేషన్ మెట్లపై భాగం నుండి కిందపడి తీవ్రంగా గాయపడిందని తెలుస్తోంది. ప్రస్తుతం పార్క్ రిడ్జ్ లోని అడ్వొకేట్ లూథరన్ జనరల్ ఆస్పత్రిలో స్పందన చికిత్స పొందుతోంది.

స్పందన స్నేహితులు చెబుతున్న వివరాల ప్రకారం.. గత నెల 31న స్పందన సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. దీంతో ఆమె తలతో పాటు పక్కటెముకలు, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. తల్లిదండ్రుల కలను సాకారం చేయడమే లక్ష్యంగా, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన స్పందన ఇలా ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమకు పాస్ పోర్ట్, వీసా లేవని, అక్కడకు వెళ్లే ఆర్థిక స్థోమత కూడా లేదని వాపోతున్నారు. కనీసం కన్న బిడ్డను చూసుకునే అవకాశం కూడా అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వపరంగా సహాయం అందించాలని కోరుతూ శ్రీనివాస్ దంపతులు కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకు అండగా ఉంటానని ఓదార్చారని తెలిపారు. పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నానని, వీసా కోసం ఎంత సమయం పడుతుందో తెలియదని చెప్పారు. తన పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరారు.

ManaTV Team

Recent Posts

అక్టోబర్ 11న నాట్స్ మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…

17 hours ago

AI పేరు మారుస్తామన్న ట్రంప్.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా పిలవాలంటూ ప్రతిపాదన!

కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…

17 hours ago

ప్రాణాలకు తెగించి 170 మందిని కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం!

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…

17 hours ago

6 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు.. 6,300 హెచ్‌-1బీ వీసాలపై మైక్రోసాఫ్ట్‌కు జేడీ వాన్స్ ప్రశ్నలు!

అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…

17 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

1 day ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

1 day ago