• 2024 – 2029 మధ్య వచ్చే రాజ్యసభ స్థానాల్లో మూడు జనసేనకు ఇచ్చేలా ముందే చర్చించడమైంది
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైంది. ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ స్థానానికి అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నిర్ణయిస్తారు. ఆ తరువాత పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీల మధ్య స్థానాలపై చర్చ జరిగింది. అప్పటి ఎన్నికల్లో సర్దుబాటుల్లో భాగంగా జనసేన తాను పోటీ చేయవలసిన లోక్ సభ స్థానాలను త్యాగం చేసింది. లోక్ సభ స్థానాలు త్యాగం చేసిన క్రమంలో రాజ్య సభలో స్థానాలు కల్పించేలా చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన అవగాహనలో భాగంగా 2024-29 మధ్య ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి రాజ్యసభ స్థానం ఈ దఫా ఎన్నికల్లో దక్కింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…