Categories: Movie News

‘ఆల్ఫా’ ప్రోమో.. హై -ఆక్టేన్ యాక్షన్ అవతార్ లో అలియా!

యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘ఆల్ఫా’. లేడీ ఓరియంటెడ్ యాక్షన్ విజువల్ వండర్ గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ సరికొత్త యాక్షన్ అవతార్‌ లో కనిపించారు.

ప్రోమోలో అలియా తన 18వ బర్త్ డేను తండ్రి (బాబీ డియోల్) తో జరుపుకుంటున్నట్లు కనిపిస్తుంది. తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమ ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. కట్ చేస్తే.. ఆమె జీవితాంతం నేర్చుకున్న శిక్షణ కేవలం పెద్దయ్యాక బతకడానికి కాదని, తన 18వ పుట్టినరోజునే ఆమె ఫస్ట్ మిషన్ కు రెడీ కావడానికని బాబీ డియోల్ పాత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత అలియా భయంకరమైన పోరాట సన్నివేశాల్లో కనిపిస్తుంది. ‘ఆల్ఫా’గా మారడమే లక్ష్యంగా ఆమెకు శిక్షణ ఇచ్చినట్లు ఈ ప్రోమో స్పష్టం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రోమోలో బాబీ డియోల్ చెప్పిన డైలాగ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. “ఈ ప్రపంచంలో తోడేళ్లు, గొర్రెలు మాత్రమే ఉంటాయి. తోడేలు కూతురు తోడేలే అవుతుంది” అని తన కూతురితో చెప్పడం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

యశ్‌రాజ్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో ఈ ప్రోమోను షేర్ చేస్తూ, “మొదటిది, వేగవంతమైనది, ధైర్యమైనది. #ALPHA” అని క్యాప్షన్ ను జోడించింది. ఈ చిత్రంలో శర్వరీ వాఘ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘గంగూబాయి’, ‘హైవే’ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న అలియా భట్, పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ManaTV Team

Recent Posts

అర్జెంటీనా అద్భుత విజయం.. మెస్సీ కన్నీళ్లు !!

ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…

11 hours ago

సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…

12 hours ago

అమెరికా 250 ఏళ్ల చరిత్ర.. టామా 45 ఏళ్ల ప్రస్థానం! ఒకే వేదికపై అద్భుతమైన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’

జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…

14 hours ago

అల్లు అర్జున్‌కి నో చెప్పిన ‘బ్లాస్ట్’ బ్యూటీ.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…

15 hours ago

‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

కన్నడ స్టార్ యశ్‌ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…

18 hours ago

ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ కట్టా.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా నటి అంజలి

స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…

20 hours ago