– కెప్టెన్ కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా!
– గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్
– గుజరాత్ చేతిలో 82 పరుగుల భారీ తేడాతో ఓడిన సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ షాక్ తగిలింది. ఓవైపు ఐపీఎల్ చరిత్రలోనే తమ అతిపెద్ద ఓటమిని చవిచూడగా, మరోవైపు స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు రూ. 12 లక్షల ఫైన్ పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో 82 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అద్భుతమైన అర్ధ శతకాలతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఇక 169 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ముగిసింది. ఈ ఘోర పరాజయంతో సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్ గణనీయంగా దెబ్బతింది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు ఇది తొలి తప్పిదం కావడంతో కెప్టెన్ కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటన చేసింది. ఈ జరిమానాతో ఓటమి బాధ మరింత పెరిగినట్లయింది.
ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…
Saraswathi Puja – Devi Navaratri Celebrations Hindu Temple of Atlanta invites all devotees to participate…
We are hosting FREE GENAI TRAINING for everyone. Nov 7th – Nov 29th, 2026 100%…