Categories: Movie News

తమిళనాడు రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్..ఆ స్థానం నుంచి పోటీ!

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ దృష్టి పూర్తిగా తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై పడింది.ఈ నేపథ్యంలో టీవీకే తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు బలంగా వినిపిస్తోంది.తిరుచ్చి ఈస్ట్ స్థానానికి టీవీకే అభ్యర్థిగా ఆయన బరిలో దిగే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.రాఘవ లారెన్స్ కు ఉన్న మాస్ ఇమేజ్, యూత్ లో ఆయనకున్న ఆదరణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్న గుర్తింపు టీవీకేకు రాజకీయ లబ్ధిని చేకూరుస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా లారెన్స్ కూడా మొదటినుంచి విజయ్ కు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని, టీవీకే పార్టీ అభ్యర్థిగా తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది.

నిజానికి ఈ స్థానం నుంచి స్టార్ హీరోయిన్ త్రిషను పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం త్రిషకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని స్పష్టమైంది. తాజాగా లారెన్స్ పేరు తెరపైకి రావడంతో ఈ విషయం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. అయితే టీవీకే అభ్యర్థి ఎంపికపై కానీ, లారెన్స్ రాజకీయ అరంగేట్రంపై కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో చివరకు ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ManaTV Team

Recent Posts

M4M’s Mohan Vadlapatla and Jo Sharma Win Best Debut Awards at ANDHRAPRADESH FILM CHAMBER OF COMMERCE

Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…

1 hour ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

8 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold#goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

9 hours ago

అక్టోబర్ 11న నాట్స్ మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…

20 hours ago

AI పేరు మారుస్తామన్న ట్రంప్.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా పిలవాలంటూ ప్రతిపాదన!

కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…

20 hours ago

ప్రాణాలకు తెగించి 170 మందిని కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం!

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…

20 hours ago