Categories: Movie News

త్రిషకు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏముందో తెలిస్తే షాక్ పక్కా.?!

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తు్న్న అందాల భామ ‘త్రిష’. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా, వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న భారీ సోషియో-ఫాంటసీ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు.

అయితే తాజాగా త్రిషకు అదిరిపోయే సమ్మర్ సర్ ప్రైజ్ అందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల..త్రిషకు నోరూరించే స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన నేతృత్వంలో ప్రముఖ హోమ్ ఫుడ్ బ్రాండ్ ‘ అత్తమ్మాస్ కిచెన్ ’ నడుస్తోంది. వీరి నుంచి త్రిషకు స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ అందింది. ఇందులో కొత్త ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు ఉన్నాయి. దీంతో గిఫ్ట్ బాస్కెట్ ను ఫోటో తీసిన సౌత్ క్రీన్ తన అఫీషియల్ ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ స్టోరీని ఉపాసనకు ట్యాగ్ చేస్తూ.. అద్భుతమైన గిఫ్ట్ చూస్తుంటే నాకు నిజంగానే సమ్మర్ వచ్చేసినట్లు అనిపిస్తోంది. థ్యాంక్యూ సో మచ్ ఉపాసన అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్రిష పెట్టిన ఈ పోస్టును ఉపాసన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో రీ-షేర్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

అక్టోబర్ 11న నాట్స్ మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…

15 hours ago

AI పేరు మారుస్తామన్న ట్రంప్.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా పిలవాలంటూ ప్రతిపాదన!

కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…

15 hours ago

ప్రాణాలకు తెగించి 170 మందిని కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం!

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…

15 hours ago

6 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు.. 6,300 హెచ్‌-1బీ వీసాలపై మైక్రోసాఫ్ట్‌కు జేడీ వాన్స్ ప్రశ్నలు!

అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…

15 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

1 day ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

1 day ago