Find Articles

ది హార్ట్ ఆఫ్ ‘ఇరుముడి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్

ది హార్ట్ ఆఫ్ ‘ఇరుముడి’.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “ఇరుముడి”. విభిన్నమైన కథలతో ఫ్యామిలీ ఎమోషన్స్ ను అద్భుతంగా తెరకెక్కించే శివ నిర్వాణ ఈసారి రవితేజను సరికొత్త పాత్రలో చూపించనున్నారు. రీసెంట్ గా ‘ ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. భక్తి, కుటుంబ బంధాల కలయికగా వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రవితేజను ఇప్పటివరకు పక్కా కమర్షియల్, యాక్షన్ పాత్రల్లోనే ఎక్కువగా చూశాం. కానీ ఇరుముడిలో మాత్రం ఆయన అయ్యప్ప స్వామి భక్తుడిగా, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఎమోషనల్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ లో సైతం తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన కోలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భక్తి, యాక్షన్, సెంటిమెంట్‌ తో వస్తున్న ‘ఇరుముడి’ ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రవితేజ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ డివోషనల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

ManaTV Team