Categories: Sports

న్యూజిలాండ్‌ గడ్డపై మెగా సిరీస్.. 12 మ్యాచ్‌లలో తలపడనున్న కివీస్, టీమిండియా

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌లో సుదీర్ఘ పర్యటనకు సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై వందేళ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని మెగా సిరీస్ నిర్వహించున్నాయి.

అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు 40 రోజుల పాటు సాగే మెగా పర్యటనలో ఇరు జట్లు మొత్తం 12 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఇందులో 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటివరకు ఏ దేశంతోనూ ఇంత పెద్ద ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో ప్రారంభంకానుండగా.. మొత్తం ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 1న ముగుస్తుంది. ఆ తర్వాత నవంబర్ 4న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో తొలి వన్డేతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని చివరి రెండు వన్డేలకు మౌంట్ మాంగనూయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే అందరి దృష్టి మాత్రం టెస్టు సిరీస్‌పైనే ఉంది. రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరగనుంది. రెండోది, పర్యటనలో చివరిది అయిన టెస్టు మ్యాచ్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా 40 రోజుల సుదీర్ఘ పర్యటన ముగుస్తుంది.

2019-20 తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. అయితే, ఈ మధ్య కాలంలో కివీస్ టీమ్ రెండుసార్లు భారత్‌లో పర్యటించింది. ముఖ్యంగా 2024-25 పర్యటనలో భారత్‌ను సొంత గడ్డపైనే 3-0 తేడాతో ఓడించి టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా సిరీస్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య వందేళ్ల క్రీడా బంధానికి గుర్తుగా న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ పర్యటనకు ప్రత్యేక మద్దతు ఇస్తోంది.

ManaTV Team

Recent Posts

అక్టోబర్ 11న నాట్స్ మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…

5 hours ago

AI పేరు మారుస్తామన్న ట్రంప్.. ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా పిలవాలంటూ ప్రతిపాదన!

కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…

5 hours ago

ప్రాణాలకు తెగించి 170 మందిని కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం!

భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…

6 hours ago

6 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు.. 6,300 హెచ్‌-1బీ వీసాలపై మైక్రోసాఫ్ట్‌కు జేడీ వాన్స్ ప్రశ్నలు!

అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…

6 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

17 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

18 hours ago