Find Articles

ఫొటో రీక్రియేషన్.. ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో ఐకానిక్ మూమెంట్.!

ఫొటో రీక్రియేషన్.. ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో ఐకానిక్ మూమెంట్.!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, కన్నడ సినీ దిగ్గజం డా. రాజ్‌కుమార్ కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం మరోసారి అందరినీ ఆకట్టుకుంది. రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ కలిసి నటించిన ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో భాగంగా తమ తండ్రుల నాటి ఓ జ్ఞాపకాన్ని రీక్రియేట్ చేశారు. ఈ ఎమోషనల్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘పెద్ది’ మూవీ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ బెంగళూరులో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే యాంకర్, చిరుని డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమగా ముద్దుపెట్టుకుంటున్న పాత ఫొటో విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఆ అరుదైన క్షణం కెమెరాలో పూర్తిగా బంధీ కాలేదు. దీంతో అదే సన్నివేశాన్ని రీక్రియేట్ చేయాలని రామ్ చరణ్, శివరాజ్‌కుమార్‌లను కోరారు. యాంకర్ అభ్యర్థనకు శివరాజ్‌కుమార్ వెంటనే స్పందించారు. రామ్ చరణ్‌ను ఆత్మీయంగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. ఈ దృశ్యం రెండు లెజెండరీ కుటుంబాల మధ్య ఉన్న ఆప్యాయతకు, గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ManaTV Team