టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ సాహసాలు, ప్రయోగాలు ఎప్పటికీ అజరామరం. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని మహేశ్ బాబు తిరుగులేని సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్నారు. ఇప్పుడు అదే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. మహేశ్ బాబు అన్నయ్య, దివంగత రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ త్వరలోనే హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
విలక్షణ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ అనే చిత్రంతో జయకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సైడ్ యాంగిల్స్ నుంచి అచ్చు గుద్దినట్లు రమేశ్ బాబులా కనిపిస్తున్న జయకృష్ణ కటౌట్, లుక్స్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో మరో స్టార్ కిడ్ కూడా టాలీవుడ్‌కి పరిచయం కావడం విశేషం. ఒకప్పుడు తెలుగులో ‘బంగారు బుల్లోడు’, ‘రథసారధి’ వంటి చిత్రాలతో అలరించిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రషా థడాని ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ‘RX 100’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ యాక్షన్ లవ్ డ్రామాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. స్టార్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. అన్ని హంగులతో సిద్ధమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జులై 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మహేశ్ బాబు ఫ్యామిలీ సపోర్ట్‌తో వస్తున్న జయకృష్ణ, రషా థడానిల ఈ కొత్త జోడీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…