ఇస్రో ప్రయోగించిన GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం EOS-05 శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి భూభాగాలను పర్యవేక్షించడంతో పాటు సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికలను గుర్తించడంలో ఈ శాటిలైట్ కీలకంగా పనిచేయనుంది. అలాగే ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టేందుకు సహాయపడనుంది.
రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంలో EOS-05 కీలకంగా మారనుంది.