Categories: India News

భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. తొలుత రూ.10, రూ.20 నోట్లతో ప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా పాలిమర్ నోట్లను వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

పాలిమర్ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక షీట్ల కోసం ఆర్‌బీఐ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్, చైనాతో సంబంధం ఉన్న కంపెనీలను టెండర్ ప్రక్రియ నుంచి నిషేధించినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 18న టెండర్ల ప్రక్రియ ముగియగా.. యూకే, ఆస్ట్రేలియా, వియత్నాంకు చెందిన కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఆయా కంపెనీలు సమర్పించిన నమూనాలను పరీక్షించిన అనంతరం తుది ఎంపిక చేపట్టనున్నట్లు సమాచారం.

తొలిదశలో రూ.10, రూ.20 విలువ కలిగిన నోట్లను పాలిమర్‌తో తయారు చేసి చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు, నకిలీ నోట్లను అరికట్టేందుకు మెరుగైన భద్రతా లక్షణాలను కలిగి ఉండే అవకాశం ఉంది.

పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రవేశంతో భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ManaTV Team

Recent Posts

గద్వాల్ విజయలక్ష్మికి కీలక పదవి.. తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్‌ చైర్మన్‌గా నియామకం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా…

19 hours ago

బ్రేకింగ్ న్యూస్ కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని…

19 hours ago

ట్రంప్ ముఖచిత్రంతో అమెరికా కొత్త $1 కాయిన్.. 25 నాణేల రోల్ ధర ఎంతంటే?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రంప్ ముఖచిత్రంతో…

19 hours ago

యేషనాగుల’ సాంగ్ సరికొత్త రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్

టాలీవుడ్‌లో ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి విడుదలైన ‘యేషనాగుల’ పాట దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు…

20 hours ago

సామాన్యుడిపై ధరల భారం.. నిత్యావసరాలు, కూరగాయల ధరలకు రెక్కలు

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ జీవితంలో తప్పనిసరిగా కొనుగోలు చేసే…

20 hours ago

మంత్రి కొండా సురేఖపై వేటు? ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు

మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మధ్యాహ్నం వరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం…

22 hours ago