Categories: India News

సామాన్యుడిపై ధరల భారం.. నిత్యావసరాలు, కూరగాయల ధరలకు రెక్కలు

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ జీవితంలో తప్పనిసరిగా కొనుగోలు చేసే పలు వస్తువుల ధరలు ఇప్పటికే 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

క్వాలిటీ బియ్యం ధర గతంలో కిలోకు రూ.45 నుంచి రూ.50 మధ్య ఉండగా.. ప్రస్తుతం రూ.70కి పైగా పలుకుతోంది. ఉల్లి ధర కూడా భారీగా పెరిగి కిలో రూ.20 నుంచి రూ.60 వరకు చేరింది.

అల్లం, వెల్లుల్లి ధరలు కిలోకు రూ.150కుపైగానే ఉన్నాయి. వంట నూనె ధరలు కూడా పెరిగాయి. గతంలో లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.160లోపే లభించగా.. ప్రస్తుతం రూ.180కిపైగా విక్రయిస్తున్నారు.

ఇక పంచదార ధర కిలోకు గతంలో సగటున రూ.40 ఉండగా.. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.70 వరకు చేరింది. కంది పప్పు, మినప పప్పు, పెసర పప్పు ధరలు కూడా గతంతో పోలిస్తే కిలోకు రూ.20కుపైగా పెరిగాయి.

దీంతో నెలవారీ ఇంటి ఖర్చులు పెరిగి.. ధరల పెరుగుదల సామాన్యుడి కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ManaTV Team

Recent Posts

గద్వాల్ విజయలక్ష్మికి కీలక పదవి.. తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్‌ చైర్మన్‌గా నియామకం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా…

19 hours ago

బ్రేకింగ్ న్యూస్ కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని…

19 hours ago

ట్రంప్ ముఖచిత్రంతో అమెరికా కొత్త $1 కాయిన్.. 25 నాణేల రోల్ ధర ఎంతంటే?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రంప్ ముఖచిత్రంతో…

19 hours ago

యేషనాగుల’ సాంగ్ సరికొత్త రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్

టాలీవుడ్‌లో ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి విడుదలైన ‘యేషనాగుల’ పాట దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు…

20 hours ago

మంత్రి కొండా సురేఖపై వేటు? ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు

మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మధ్యాహ్నం వరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం…

22 hours ago

భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. తొలుత రూ.10, రూ.20 నోట్లతో ప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లకు…

22 hours ago