ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్‌పర్సన్‌గా నియమితులైన మధు యాష్కీ గౌడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధు యాష్కీ గౌడ్‌ను కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్‌కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా మధు యాష్కీ గౌడ్ నియామకం పట్ల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.