Find Articles

లుక్‌ఔట్ నోటీసుల నేపథ్యంలో యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు

లుక్‌ఔట్ నోటీసుల నేపథ్యంలో యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు

ప్రముఖ యూట్యూబర్ నందనను ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్‌ఔట్ నోటీసులు జారీ అయి ఉండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై గతంలో నందన, ఆమె భర్తపై పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.

ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ManaTV Team