తమిళనాడులో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న ఈ రూమర్లపై లారెన్స్ స్వయంగా స్పందించిన విషయం తెలిసిందే. తన జీవితంలో అత్యంత కీలకమైన, రాజకీయ నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో, ఆయన తీసుకోబోయే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రాఘవ లారెన్స్ ముందుగా ప్రకటించిన దాని ప్రకారం జూన్ 11న ఉదయం 9:30 గంటలకు కీలక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, ఊహించని విధంగా కోలీవుడ్ లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. దీంతో యావత్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినిమా రంగానికి భారతీరాజా చేసిన అపార సేవలకు, ఆయనపై ఉన్న గౌరవ సూచకంగా రాఘవ లారెన్స్ తన జీవితంలో తీసుకోబోయే ఆ నిర్ణయ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని జూన్ 12 ఉదయం 10:00 గంటలకు వెల్లడిస్తానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…