Find Articles

రామ్ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత.. పెరిగిపోతున్న అంచనాలు

రామ్ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత.. పెరిగిపోతున్న అంచనాలు

#RAPO23 సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు గ్రహీత తిరు ఎంపిక
– విజువల్స్‌పై పెరిగిన అంచనాలు

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకత్వంలో రాబోతున్న తొలి చిత్రం #RAPO23. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు అలియాస్ తిరు భాగమయ్యారు.

మే నెల 15న రామ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే కథ, దర్శకత్వం అందిస్తూ, ‘వీర’ అనే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ‘రాపో సినిమాటిక్స్’ అనే కొత్త బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గతంలో ‘ ఆంధ్రా కింగ్ తాలుకా’ చిత్రానికి గీత రచయితగా పని చేసిన రామ్, ఇప్పుడు ఏకంగా రైటర్, డైరెక్టర్, హీరోగా బాధ్యతలు చేపట్టడం విశేషం.

ప్రస్తుతం శరవేగంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి తిరు కెమెరామెన్‌గా వ్యవహరించనుండటంతో అంచనాలు పెరిగాయి. తిరు చేరికతో #RAPO23 విజువల్స్ అత్యున్నత స్థాయిలో ఉంటాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుండగా, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

ManaTV Team