Find Articles

సినిమా చేయడం ఓ సేవ.. ప్రేక్షకులు దేవుళ్లు జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు

సినిమా చేయడం ఓ సేవ.. ప్రేక్షకులు దేవుళ్లు జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు

సినిమా చూసే ప్రేక్షకులు దేవుళ్లతో సమానమని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా తీయడం వారికి చేసే ఓ గొప్ప సేవ అని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలే నటీనటులను మరింత రాటుదేలేలా చేస్తాయని తెలిపారు.

ఆడియెన్స్ ను అలరించడానికే తాము నిరంతరం శ్రమిస్తామని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.అయితే, సోషల్ మీడియాలో కొందరు మూవీని చూడకుండానే పెదవి విరుస్తుంటారని, అయినప్పటికీ వారి అభిప్రాయాలను తాము పూర్తిగా కొట్టిపారేయలేమని చెప్పారు. ప్రేక్షకుల అభిప్రాయాలు ఎంత కఠినంగా ఉన్నా సరే, తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఎంతో సహాయపడతాయని వివరించారు. మంచి ఉద్దేశంతో పాటు కష్టపడి, నిజాయితీగా తీసే ఏ సినిమా అయినా కచ్చితంగా ప్రేక్షకులకు చేరుతుందని జాన్వీ కపూర్ ధీమా వ్యక్తం చేశారు.ప్రేక్షకులు ఇచ్చే ప్రతి ఫీడ్ బ్యాక్ ను స్వీకరిస్తానని స్పష్టం చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, జాన్వీ ప్రస్తుతం ‘ పెద్ది’ సినిమాలో నటించారు.భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ManaTV Team