
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన చిత్రం ‘ మా ఇంటి బంగారం’ రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘U/A’ సర్టిఫికెట్‌ను పొందింది.
యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఓం ప్రకాశ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు.
ఇటీవల విడుదలైన మా ఇంటి బంగారం మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. సమంత యాక్షన్ సీన్స్ నేపథ్యంలో.. చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

