Find Articles

భారత్ సహా విదేశీ విద్యార్థులపై అమెరికా నిఘా.!

– అమెరికాలో ఓపీటీ దుర్వినియోగం..
– 10 వేల మంది విదేశీ విద్యార్థుల గుర్తింపు

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం నిఘాను పెంచింది. ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న సుమారు 10 వేల మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తెలిపింది. వీరిలో అనేకమంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఓపీటీ దుర్వినియోగంపై యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొంది. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఓపీటీ నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు అమెరికాలోని సంస్థల నుంచే శిక్షణ పొందాలి. కానీ, చాలామంది భారత్‌లోని ఉద్యోగుల పర్యవేక్షణలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.అదేవిధంగా తప్పుడు పత్రాలతో అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగించుకుంటున్నట్లు కూడా విచారణలో తేలిందని వెల్లడించారు. ఓపీటీ కింద అమెరికాలో పనిచేసే విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి లక్షల్లోకి చేరిందని, అలాగే మోసాలు పెరిగాయని అధికారులు తెలిపారు.

ఓపీటీ అంటే ఏమిటి.?
అమెరికాలో F-1 స్టూడెంట్ వీసాతో చదువుతున్న విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక పని అనుభవం కల్పించే విధానాన్నే ఓపీటీ అంటారు.ఇది సాధారణంగా ఏడాది పాటు ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి అదనంగా 24 నెలల పొడిగింపు లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు అమెరికన్ కంపెనీల్లో పనిచేసి అనుభవం సంపాదిస్తారు.వీరిలో చాలామంది తరువాత H-1B ఉద్యోగ వీసాకు మారే అవకాశాన్ని కూడా పొందుతున్నారు. అందుకే అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు ఓపీటీ అనేది చాలా కీలకంగా మారింది.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *