ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ రికార్డులు సృష్టిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ఆటను చూపించిన ఈ కుర్రాడు హాఫ్ సెంచరీ తరువాత వేళ్లతో ‘ A’ సింబల్ చూపిస్తూ చేసిన సంబరాలు నెట్టింట వైరల్ గా మారాయి.
మ్యాచ్ ముగిసిన తర్వాత కామెంటేటర్ మురళీ కార్తీక్ ఆ ‘A’ సింబల్ సెలబ్రేషన్స్ గురించి వైభవ్‌ను అడిగారు.. మొదట వైభవ్ నవ్వుతూ సరదాగా దాటవేసే ప్రయత్నం చేశారు. తరువాత ప్రతి మ్యాచ్‌లో కొత్తదనం చూపించడానికి అలా చేశానని చెప్పారు. కానీ చివరకు అసలు రహస్యాన్ని బయటపెట్టారు.. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించడం విశేషం. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవుతుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించానని స్పష్టం చేశారు. అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.