Find Articles

“రాయల్”సీమ ప్రగతి.. “బుల్లెట్” స్పీడ్: ముంబై ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్

“రాయల్”సీమ ప్రగతి.. “బుల్లెట్” స్పీడ్: ముంబై ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ 2026లో ఆయన పాల్గొన్నారు.  “సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో చూపిస్తున్న వేగమే (Speed) ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆంధ్రప్రదేశ్ ఉత్పాదక (Manufacturing) రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడుతోంది. రాయలసీమ ప్రాంతానికి ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ రాకతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి ‘బుల్లెట్’ వేగంతో దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు.ఈ సదస్సు వేదికగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధుల బృందం మంత్రి నారా లోకేష్‌ను ప్రత్యేకంగా కలుసుకుంది. ఏపీలో తమ వ్యాపార విస్తరణ, ప్రగతికి సూచికగా మంత్రి లోకేష్‌కు ఒక ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ జ్ఞాపికను (Memento)’ బహుకరించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ManaTV Team