Find Articles

14 ఏళ్ల తరువాత.. ‘ స్పిరిట్’ మూవీలో నదియా..!!

14 ఏళ్ల తరువాత.. ‘ స్పిరిట్’ మూవీలో నదియా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘ స్పిరిట్’. ఈ సినిమా షూటింగ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా, షూటింగ్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ హాట్ టాపిక్ గా మారుతోంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ లో సీనియర్ నటి నదియా పాల్గొన్నారని తెలుస్తోంది. గతంలో మిర్చి సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించిన ఆమె, దాదాపు 14 సంవత్సరాల తరువాత ఆయనతో కలిసి నటించనున్నారు. మిర్చిలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కనిపించనుండటంతో ప్రాజెక్టుపై ఆసక్తి మరింతగా పెరిగిపోయింది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, వివేక్ ఒబేరాయ్ విలన్ గా కనించనున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ManaTV Team