
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్‌బ్యాంక్ (Sber bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మాస్కోలో భేటీ అయ్యారు. భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ గిగాచాట్ ఎల్ఎల్ఎం ను విస్తరించాలని మంత్రి లోకేష్ కోరారు. యూపీఐ నెట్‌వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ.. స్బేర్‌బ్యాంక్ అడ్వాన్స్ డ్ వాయిస్ రికగ్నిషన్ & బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ కోసం సాంకేతిక సహకారం అందించాలని, ఏపీ ఫార్మా, అగ్రి ఎక్స్ పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించాలని కోరినట్లు నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

