
అమరావతి: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన అటా బృందం.. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ నగరంలో నిర్వహించ తలపెట్టిన 19వ అటా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆయనకు అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సమావేశం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల (NRIs) బాగోగులను, వారి క్షేమ సమాచారాలను అటా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు వారు విదేశాల్లో సాధిస్తున్న ప్రగతి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో అటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల, పూర్వాధ్యక్షులు భువనేశ్ బుజాల, శరత్ వేముల, శ్రీకాంత్ గుడిపాటి తదితర ముఖ్య ప్రతినిధులు ఉన్నారు.

