Find Articles

బుచ్చిబాబు హ్యాట్రిక్ మూవీ ప్రిన్స్ తోనేనా.?

బుచ్చిబాబు హ్యాట్రిక్ మూవీ ప్రిన్స్ తోనేనా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్‌ను దాటేసి రికార్డులు సృష్టిస్తోంది.ఈ సక్సెస్ ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

మరోవైపు, ‘ఉప్పెన’, ‘పెద్ది’ సినిమాలతో వరుసగా రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా.. తన కెరీర్‌లో హ్యాట్రిక్ మూవీని ఎవరితో చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తన నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్‌పై స్పందించారు.మహేశ్‌బాబుతో తర్వాతి సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ దీనిపై పూర్తి క్లారిటీ రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అన్యపదేశంగా చెప్పుకొచ్చారు.ఒకవేళ ఇదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

ManaTV Team