
చూస్తూ చూస్తూ రెండేళ్లు అయిపోయింది. ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలో అంతం అవుతుంది. బాధితులైన ప్రజల తరఫున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం అధికారలోకి వచ్చాక జగన్ 2.O లో కార్యకర్తలనే అందరికంటే బాగా చూసుకుంటాం. ఎప్పుడైనా పేదవాడికి అండగా ఉండాలని వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పాడు? జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇస్తాం అన్నారు. బాండ్లు రాసిచ్చారు. ఇంటింటికీ తిరిగి మీకు రూ.1500 అంటూ తిరిగారు. అధికారం చేపట్టి రెండేళ్లు అయినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారనీ జగన్ అన్నారు.

