Find Articles

మాయ చేసిన సమంత.. నెట్టింట ‘ మా ఇంటి బంగారం ’ ఫస్ట్ టాక్

మాయ చేసిన సమంత.. నెట్టింట ‘ మా ఇంటి బంగారం ’ ఫస్ట్ టాక్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందినీ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవుతుండటంతో సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది.

మా ఇంటి బంగారం సినిాలమో సమంత మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మాయ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో ఆమె కామెడీ టైమింగ్, ఎమోషన్స్, ఫైట్ సీక్వెన్స్‌లలో చూపించిన యాక్షన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్ అని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే కథనం విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. నందినీ రెడ్డి మార్క్ సెంటిమెంట్, కామెడీ బాగానే వర్కవుట్ అయినప్పటికీ, మూవీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగడం మైనస్ గా మారిందని ఆడియెన్స్ చెబుతున్నారు. స్టోరీలో వచ్చే ట్విస్టులు, కొన్ని సీన్స్ ముందే ప్రెడిక్టబుల్ గా ఉండటంతో సినిమా కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపిస్తుందని తెలుస్తోంది. ఏదీఏమైన, సమంత తన భుజాలపై సినిమాను నడిపించిన తీరు మాత్రం సూపర్. ఎమోషనల్ కనెక్టివిటీ ఆ లోపాలను కొంతవరకు కవర్ చేశాయని సమాచారం. ఓవరాల్ గా భారీ అంచనాలు లేకుండా చూస్తే మాత్రం మా ఇంటి బంగారం కచ్చితంగా అలరిస్తుందని చెబుతున్నారు.

ManaTV Team