
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 30వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ‘RL-30’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం కాకముందే క్యాస్టింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు టాప్ హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది.
ఈ భారీ చిత్రంలో సాయి పల్లవి, జాన్వీ కపూర్, రుక్మిణి వసంత్ తో పాటు కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నలుగురు నటీమణులకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సౌత్ ఇండియన్ సినిమాలో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను రాఘవ లారెన్స్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాఘవేంద్ర ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం.
తిరుపుగల్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హీరోయిన్ల వార్తతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

