Find Articles

‘కొరియన్ కనకరాజు’ నుంచి రెండో పాట… ‘రాస గుమ్మడి’ విడుదల తేదీ ఖరారు

‘కొరియన్ కనకరాజు’ నుంచి రెండో పాట… ‘రాస గుమ్మడి’ విడుదల తేదీ ఖరారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నుంచి రెండో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ‘రాస గుమ్మడి’ పేరుతో రూపొందిన ఈ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను జూలై 19న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘కమ్సహమ్నిదా’ కొరియన్ శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోగా, రెండో పాట మాత్రం పూర్తి భిన్నంగా రాయలసీమ బీట్స్ నేపథ్యంలో ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయగా, అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన దక్షా నగార్కర్ కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ManaTV Team