Find Articles

టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం.. ఉప ఎన్నికలకు రెడీ

టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్ణయం.. ఉప ఎన్నికలకు రెడీ

టాలీవుడ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDDA) కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌లో ఖాళీగా ఉన్న పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

అసోసియేషన్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణతో పాటు పరిశీలన కూడా చేపట్టనున్నారు.

జులై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే మొత్తం ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది.

ఇటీవల అసోసియేషన్‌లో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో కొంతమంది సభ్యులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఖాళీ అయిన పదవులను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ సభ్యుల భాగస్వామ్యంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ManaTV Team