Find Articles

భారత్‌ సైనిక విన్యాసాలపై పాక్‌ అలర్ట్‌.. సరిహద్దుల్లో నిఘా పెంపు

భారత్‌ సైనిక విన్యాసాలపై పాక్‌ అలర్ట్‌.. సరిహద్దుల్లో నిఘా పెంపు

భారత్‌ నిర్వహించనున్న సైనిక విన్యాసాల నేపథ్యంలో పాకిస్థాన్‌ అప్రమత్తమైంది. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 7 వరకు రాజస్థాన్‌లో 17 రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు భారత్‌ నోటం జారీ చేసినట్లు సమాచారం.

ఈ పరిణామంపై పాకిస్థాన్‌ రక్షణ శాఖ అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, భారత సైనిక విన్యాసాలపై సమీక్ష చేపట్టారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచాలని సైనిక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

సైనిక విన్యాసాల సమయంలో ఎయిర్‌స్పేస్‌ పరిమితులు, భద్రతా చర్యలు తదితర అంశాలపై విమాన ఆపరేటర్లకు ముందస్తుగా నోటం (NOTAM) జారీ చేయడం సాధారణ ప్రక్రియ.

ManaTV Team