ముంబైలో గణేశోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ప్రముఖులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబా మంగళవారం ప్రసిద్ధ లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గణపతి పాదాలకు నమస్కరించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రామ్‌దేవ్ బాబా లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.