అంతరిక్షంలో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా స్పేస్ ఫోర్స్ తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఆ ఆయుధాలు ఏ రకానికి చెందినవి? వాటి సామర్థ్యం ఎంత? అనే వివరాలను మాత్రం అమెరికా వెల్లడించలేదు.
అంతరిక్షంలో అమెరికా సైనిక సామర్థ్యాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా ప్రకటనతో ఇతర దేశాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
అంతరిక్షాన్ని భవిష్యత్ సైనిక పోరాటాలకు కీలక వేదికగా భావిస్తున్న నేపథ్యంలో.. అమెరికా తాజా ప్రకటన ప్రపంచ దేశాల్లో కొత్త భద్రతా చర్చకు తెరతీసింది.