దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె చేపట్టే అవకాశం ఉంది. వారానికి నాలుగు శనివారాలు సెలవులు ఇవ్వాలనే తమ డిమాండ్‌ను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం తెలిపారు.
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు నెలలో రెండు శనివారాలు మాత్రమే సెలవులు ఉన్నాయి. ఈ సెలవులను నెలలో వచ్చే నాలుగు శనివారాలకూ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
ఈ అంశంపై సెప్టెంబర్ 22న లేబర్ వెల్ఫేర్ కమిషనర్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమస్యకు పరిష్కారం లభించకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల సమ్మె చేపట్టడం ఖాయమని వెంకటాచలం స్పష్టం చేసినట్లు సమాచారం.
సమ్మె జరిగితే దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఖాతాదారులు ముందుగానే తమ బ్యాంకింగ్ అవసరాలను పూర్తి చేసుకోవడం మంచిది.