కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలతో సమావేశం కానున్నారు.
త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షా పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
ఆదివారం అమిత్ షా తూప్రాన్‌పేట్, కరీంనగర్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
అమిత్ షా పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలతో జరిగే సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.