Find Articles

పండుగ వేళ సామాన్యులకు ధరల షాక్.. పెరగనున్న నిత్యావసరాల ధరలు

పండుగ వేళ సామాన్యులకు ధరల షాక్.. పెరగనున్న నిత్యావసరాల ధరలు

దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న వేళ సామాన్యులపై ధరల పెరుగుదల భారం పడే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం, విమాన ప్రయాణ ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎల్‌నీనో ప్రభావం, రూపాయి విలువ పతనం, ఇంధన ధరల పెరుగుదల, తక్కువ వర్షపాతం కారణంగా పంట దిగుబడులు తగ్గడం వంటి అంశాలు ఆహార ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల స్వీట్లు, రెస్టారెంట్లలో తయారయ్యే ఆహార పదార్థాల ధరలు కూడా పెరగవచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల విషయానికొస్తే.. మెమరీ చిప్‌ల కొరత, లోహాల ధరల పెరుగుదల కారణంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దీంతో ఈ పండుగ సీజన్‌లో కొనుగోళ్లకు సిద్ధమవుతున్న వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

ManaTV Team