Find Articles

పీఎం మెమెంటోస్‌ వేలం గడువు పొడిగింపు

పీఎం మెమెంటోస్‌ వేలం గడువు పొడిగింపు

ప్రధానమంత్రికి లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి నిర్వహిస్తున్న ‘పీఎం మెమెంటోస్‌’ 8వ విడత ఆన్‌లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది.

ఈ ఆన్‌లైన్ వేలంలో మొత్తం 30 రకాల జ్ఞాపికలు, కానుకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తెలంగాణకు చెందిన కాకతీయ కళాతోరణం వెండి నమూనా కూడా ఉంది. దీనికి రూ.10 లక్షల ప్రాథమిక ధర నిర్ణయించారు.

ఇక ఈ వేలంలో అత్యధిక ప్రాథమిక ధరను జగన్నాథ పరివార రథం ప్రతిమకు నిర్ణయించారు. దీని బేస్ ప్రైస్ రూ.21 లక్షలుగా ఉంది.

వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు ఈ ఆన్‌లైన్ వేలంలో పాల్గొని తమకు నచ్చిన జ్ఞాపికలను సొంతం చేసుకోవచ్చు.

ManaTV Team