Find Articles

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని సైనిక కూటమి యెమెన్‌లోని 82 హూతీ సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.

అక్టోబర్ 6, 7 తేదీల్లో నిర్వహించిన ఈ వైమానిక దాడుల్లో ముగ్గురు మరణించగా, 36 మంది గాయపడినట్లు సమాచారం.

సౌదీ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికి, పౌర లక్ష్యాలపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. ఇటువంటి దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.

సౌదీ కూటమి దాడుల్లో ధ్వంసమైన హూతీ స్థావరాల్లో బాలిస్టిక్ మిస్సైల్ నిల్వ కేంద్రాలు, కమాండ్ సెంటర్లు ఉన్నట్లు వెల్లడించింది.

ManaTV Team