రైల్వే ప్రయాణికులకు సంబంధించి రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. అక్టోబర్ 27 నుంచి ఆఫ్లైన్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ బీమా సౌకర్యం ఉద్దేశం.
అయితే, ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందాలనుకునే ప్రయాణికులు టికెట్ ధరకు అదనంగా 45 పైసలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించడం సాధ్యం కాదని, డిజిటల్ చెల్లింపుల ద్వారానే చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
ఈ నేపథ్యంలో టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మార్పుతో ఆఫ్లైన్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందే అవకాశం కలగనుంది.