మెగా హీరో, సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. గురువారం జరిగిన ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
ఈ శుభవార్తపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం, సాయి ధరమ్ తేజ్, కిరణ్మయిల వివాహం డిసెంబర్ 10న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.