ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహంపై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి వివాహ వేడుకలు గ్రీస్‌లో నవంబర్ 10, 11 తేదీల్లో జరగనున్నట్లు సమాచారం.
ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు గ్రీస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
వివాహ వేడుకలు ముగిసిన అనంతరం నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ స్వయంగా అతిథులను ఆహ్వానించినట్లు తెలిసింది.
అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుకలపై సినీ, క్రీడా రంగాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.