Find Articles

టీవీకే ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ ఆగ్రహం.. రేపు అత్యవసర సమావేశం

టీవీకే ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ ఆగ్రహం.. రేపు అత్యవసర సమావేశం

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ ఎమ్మెల్యేల వరుస వివాదాలు కలకలం రేపుతున్నాయి. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడంపై ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలకు విజయ్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పరిస్థితిని సమీక్షించేందుకు రేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ తక్షణమే చెన్నైకి చేరుకోవాలని పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. వరుస వివాదాలకు కారణమవుతున్న ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

పార్టీ నేతల పనితీరు, క్రమశిక్షణ, ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠకు సంబంధించిన అంశాలపై విజయ్ కీలక సూచనలు చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న టీవీకే ఎమ్మెల్యేల వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రేపటి అత్యవసర సమావేశంలో విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

ManaTV Team