Find Articles

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. CPS నుంచి OPSకు మారేందుకు అవకాశం

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. CPS నుంచి OPSకు మారేందుకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు అర్హులైన ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్పు కోసం ఉద్యోగులు ఒకేసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే నియామక నోటిఫికేషన్ జారీ అయి ఉండాలి. ఆ నోటిఫికేషన్ ఆధారంగా 2004 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరి ఉండాలి. ఈ నిబంధనలకు అర్హులైన ప్రస్తుత ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన వారు NIDHI పోర్టల్‌లోని CPS-OPS Conversion ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం నియామక నోటిఫికేషన్, సెలక్షన్ లిస్ట్, అపాయింట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్ వంటి పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి.

దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించిన అనంతరం OPSకు మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటారు. OPSకు మారిన ఉద్యోగులకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 వర్తిస్తాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ManaTV Team