Find Articles

అట్లాంటాలో భక్తి సంగీత వేడుక.. డిసెంబర్ 4న ‘అట్లాంటా భజన్ క్లబ్బింగ్

అట్లాంటాలో భక్తి సంగీత వేడుక.. డిసెంబర్ 4న ‘అట్లాంటా భజన్ క్లబ్బింగ్

అమెరికాలోని అట్లాంటాలో భారతీయ భక్తి సంగీతానికి పెద్దపీట వేస్తూ ‘అట్లాంటా భజన్ క్లబ్బింగ్’ (ABC) ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భక్తి గీతాలు, సంగీతంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

డిసెంబర్ 4, 2026 శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. జార్జియాలోని కమ్మింగ్ నగరంలో ఉన్న సెలబ్రేషన్స్ బ్యాంక్వెట్ హాల్ ఈ వేడుకకు వేదిక కానుంది.

ఈ కార్యక్రమంలో భక్తి సంగీతం, భజనలతో పాటు సంగీత వాయిద్యాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భక్తితో ఒక్కచోట చేరి ఆనందంగా భజనలు పాడుతూ దైవానుభూతిని పొందాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రవేశ రుసుము 20 డాలర్లుగా నిర్ణయించారు. హాజరయ్యే వారికి తేలికపాటి అల్పాహార ఏర్పాట్లు కూడా చేయనున్నారు.

కార్యక్రమ నిర్వాహకులుగా లక్కీ మండవిల్లి, రాధిక వంగపల్లి వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం 404-944-7914, 914-374-8850 నంబర్లను సంప్రదించవచ్చు.

అట్లాంటాలోని తెలుగు కుటుంబాలు, భక్తి సంగీత ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు

ManaTV Team