Find Articles

పుతిన్ వెంట నల్లటి బ్రీఫ్‌కేస్.. అంతర్జాతీయంగా చర్చనీయాంశం

పుతిన్ వెంట నల్లటి బ్రీఫ్‌కేస్.. అంతర్జాతీయంగా చర్చనీయాంశం

చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న ఏపెక్ (APEC) సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెంట కనిపించిన నల్లటి బ్రీఫ్‌కేస్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బ్రీఫ్‌కేస్ రష్యా అణ్వాయుధ కమాండ్ వ్యవస్థలో కీలకమైన ‘చెగెట్’ (Cheget) అని అధికారులు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

రష్యా అధ్యక్షుడికి సైనిక కమాండ్ వ్యవస్థతో సంప్రదింపులు జరిపేందుకు, అవసరమైన అణు ఆదేశాలను పంపేందుకు ఈ ప్రత్యేక పరికరం ఉపయోగపడుతుందని సమాచారం. రష్యా అణ్వాయుధ నియంత్రణ వ్యవస్థలో ఇది కీలకమైన భాగంగా పరిగణించబడుతుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో పుతిన్ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ బ్రీఫ్‌కేస్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ భద్రత, అణ్వాయుధ నియంత్రణ వ్యూహాల నేపథ్యంలో ఈ పరికరం ప్రాధాన్యతపై చర్చ జరుగుతోంది.

ManaTV Team