Find Articles

వికారాబాద్ జిల్లాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపేసిన చిరుత!

వికారాబాద్ జిల్లాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపేసిన చిరుత!

వికారాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. దోమ మండలంలోని దిర్సంపల్లి తండా పరిధిలో ఉన్న గోవింద్ బుడ్యా నాయక్ తండాలో చిరుతపులి దాడి ఘటన చోటుచేసుకుంది.

నేనావత్ రాజు అనే రైతుకు చెందిన బర్రె దూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి పాదముద్రలను పరిశీలించారు. చిరుతపులి జనావాసాల సమీపంలో సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

ManaTV Team